సూర్య సినిమాకి హైప్ ఏదీ

NGK lacks buzz and hype in Telugu
Thursday, May 23, 2019 - 00:15

సూర్య న‌టించిన ఎన్‌.జి.కే (నంద గోపాల కృష్ణ‌) ఈ నెల 31న విడుద‌ల కానుంది. త‌మిళ భాషలోనూ, తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కానున్నాయి. ఐతే ఈ సినిమాకి తెలుగులో ఇంత‌వ‌ర‌కు హైప్ లేదు. బ‌జ్ లేదు. ఏదో ట్ర‌యిల‌ర్ విడుద‌ల చేశామంటే చేశామ‌న్న‌ట్లు చేతులు దులుపుకున్నారు. సినిమాలో సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ హీరోయిన్లుగా ఉన్నా... ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ (ఆడ‌వారి మాట‌ల‌కి అర్థాలు వేరులే, సెవ‌న్జీ బృందావ‌న కాల‌నీ) తెలుగువారికి బాగా ప‌రిచ‌యం ఉన్నా కూడా ఈ సినిమా టీమ్ పెద్ద‌గా హడావుడి చేయ‌డం లేదు. 

బ‌హుశా ఈ సినిమా క‌థ తెలుగువారికి అంత‌గా న‌ప్ప‌ద‌ని ముందే డిసైడ్ అయ్యారేయో. ఇది ఒక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. ఆ రాజ‌కీయ అంశాల్లో మొత్తం అర‌వ వాస‌నే. అది మ‌న‌కి అంత‌గా క‌నెక్ట్ అయ్యే పాయింట్ కాదు. 

సూర్య మార్కెట్ రోజురోజుకి త‌గ్గిపోతోంది. ఈ నెలాఖ‌రున తెలుగు సినిమాలేవీ పోటీలో లేవు. త‌మ‌న్న న‌టించిన అనువాద చిత్రం అభినేత్రి 2 మాత్ర‌మే విడుద‌ల కానుంది. ఇంత క్లియ‌ర్‌గా ఉన్న‌పుడు కూడా సూర్య హైప్ వ‌చ్చేలా ప్ర‌మోష‌న్ చేయ‌క‌పోవ‌డం విచిత్ర‌మే.