సైంటిస్ట్ గా మిసెస్ మజ్ను

Nidhi Agerwal plays scientist
Tuesday, March 5, 2019 - 22:30

రామ్, పూరి జగన్నాధ్ కాంబోలో "ఇస్మార్ట్ శంకర్" సినిమా వస్తోంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. పూరి జగన్నాధ్ స్టయిల్ లో ఇదొక మాస్ మూవీ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ అనే విషయాన్ని తెలుగుసినిమా.కామ్ గతంలోనే బ్రేక్ చేసింది. ఇప్పుడు దానికి మరో బలమైన ఆధారం దొరికింది.

అవును... ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ సైంటిస్ట్ గా కనిపించబోతోంది. ఆ విషయాన్ని నిధి స్వయంగా వెల్లడించింది. ఈమె ఎనౌన్స్ మెంట్ తో ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనే విషయం కన్ ఫర్మ్ అయింది. ఇందులో నిధి అగర్వాల్ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. రామ్ క్యారెక్టర్ ను, అతడి మైండ్ సెట్ ను మార్చేసే శాస్త్రవేత్త పాత్రలో నిధి కనిపిస్తుందట.

తన కెరీర్ లో పూరి జగన్నాధ్ ఇలాంటి సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేయలేదు. మరి ఈ సినిమాను ఎలా తీస్తాడో చూడాలి. మే నెలలో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.