న‌న్ను మీ(టూ)టితే లేపేస్తా!

Nidhi Agerwal responds on Me Too movement
Thursday, November 8, 2018 - 10:15

కాస్టింగ్ కౌచ్ పై ఒక్కో హీరోయిన్ ఒక్కో విధంగా స్పందిస్తోంది. నిధి అగర్వాల్ వెరైటీగా స్పందించింది. "సవ్యసాచి" సినిమాతో తెలుగు స్క్రీన్ కు పరిచయమైన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం అఖిల్ స‌ర‌స‌న "మిస్ట‌ర్ మ‌జ్ను" సినిమాలో న‌టిస్తోంది.

కాస్టింగ్ కౌచ్ పై డిఫరెంట్ గా రియాక్ట్ అయింది. తన దగ్గర సెక్సువల్ ప్రపోజల్స్ తీసుకొచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమంటోంది నిధి. ఎందుకంటే తనకు బాక్సింగ్ వచ్చని సెలవిస్తోంది. 

"మీటూ మూమెంట్ బాగానే నడుస్తోంది. నా విషయానికొస్తే నన్ను ఎవరూ వేధించలేదు. సెక్సువల్ ఫేవర్స్ చేయమని బలవంతం చేయలేదు. ఎందుకంటే నాకు బాక్సింగ్ వచ్చు. జిమ్ కు కూడా వెళ్తాను. వీటితో పాటు మార్షల‌ ఆర్ట్స్ కూడా కాస్త టచ్ ఉంది. ఎవ‌రైనా అలా చేశారంటే వారిని ఒక్క కిక్‌తో వ‌ణికిస్తా," అని ఘాటుగా స‌మాధానం ఇచ్చింది.

ఇవన్నీ పక్కనపెడితే.. "తనకు ఇనస్టాగ్రామ్ లో ఎకౌంట్ ఉందని.. ఎవరైనా తనను లైంగికంగా వేధిస్తే వెంటనే ఆ వివరాల్ని ఇనస్టాగ్రామ్ లో పెట్టి, సదరు వ్యక్తి పరువు తీసేస్తానని ఓపెన్ గా"  చెబుతోంది నిధి అగర్వాల్. నిజంగా ఈ కాలం హీరోయిన్లకు ఇంత ధైర్యం ఉండడం అవసరమే. ఏమంటారు..!