అందాల నిధికి క‌లిసొచ్చేనా?

Nidhii Agerwal now pins hopes on Akhil
Saturday, November 3, 2018 - 23:30

'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్‌ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన న‌టించి సినిమారంగంలోకి అడుగుపెట్టింది మోడ‌ల్ నిధి అగ‌ర్వాల్‌. . నాగచైతన్య నటించిన‌ 'సవ్యసాచి' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. తొలి సినిమా ఆమెకి క‌లిసిరాలేదు. హిట్‌, ఫ్లాప్‌ల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఆమెకి ఈ సినిమాలో ద‌క్కిన పాత్ర "చిత్ర‌"విచిత్ర‌మైన‌ది. ఏ మాత్రం గుర్తింపు వ‌చ్చేది కాదు. 

మొద‌టి సినిమా విడుద‌ల కాక‌ముందే ఆమె చైత‌న్య త‌మ్ముడు అఖిల్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టేసింది.

'మిస్ట‌ర్ మ‌జ్ను'లో ఆమె హీరోయిన్‌. అది పూర్తిగా ప్రేమ‌క‌థాచిత్రం. పైగా ఆ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి హీరోయిన్ల‌కి మంచి క్యార‌క్ట‌ర్స్ రాయ‌గ‌ల‌డ‌ని పేరు వ‌చ్చింది. ఎందుకంటే త‌న మొద‌టి సినిమా 'తొలిప్రేమ‌'లో రాశిఖ‌న్నాకి సూప‌ర్ రోల్ ఇచ్చాడు. మ‌రి ఈ అందాల నిధికి రెండో సినిమా అయినా క‌లిసొచ్చేనా?