హనీమూన్ వద్దంటున్న హీరో!

Nikhil says no plans for honeymoon
Wednesday, March 11, 2020 - 22:30

నిజంగా ఇది కాస్త విచిత్రమైన విషయమే. పెళ్లి తర్వాత హనీమూన్ ఎప్పుడు చేసుకుందామా అని అంతా తహతహలాడుతుంటారు. ఎంగేజ్ మెంట్ అయిన మరుసటి రోజు నుంచే హనీమూన్ కు ప్రత్యేకంగా పథకాలు రచించుకుంటారు. కానీ నిఖిల్ విషయంలో అంత ఊహించుకోవడానికేం లేదు. అవును.. పెళ్లి చేసుకుంటాం కానీ హనీమూన్ కు మాత్రం టైమ్ లేదంటున్నాడు ఈ హీరో. 

తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు నిఖిల్. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అయితే హనీమూన్ కు మాత్రం టైమ్ లేదంటున్నాడు. "కార్తికేయ-2", "18 పేజెస్" రూపంలో ఒకేసారి రెండు సినిమాల్ని స్టార్ట్ చేసిన ఈ హీరో.. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉంటుండగానే.. వీక్లీ ఆఫ్ తీసుకొని మరీ పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. ఇక హనీమూన్ గురించి మాట్లాడుతూ.. "కార్తికేయ-2" కంప్లీట్ అయ్యేవరకు నో హనీమూన్ అంటున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా చెప్పాడు. 

నితిన్ అలాంటి స్టేట్ మెంట్ ఏమి ఇవ్వలేదు. కానీ అతను కూడా సినిమాలతో బిజీనే.