నిక్కీ ఇస్తున్న కిక్కు వేరప్పా

Nikki Tamboli turns up the heat on Instagram
Monday, March 16, 2020 - 16:45

నిక్కీ తంబోళీ.. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టడం కష్టం. కానీ ఇదే ప్రశ్న కొంతమంది నెజిటన్లను అడిగితే మాత్రం ఆ హాట్ బ్యూటీ గురించి తమకు బాగా తెలుసంటారు. సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో అంతగా పాపులర్ అవుతోంది ఈ అమ్మాయి.

లారెన్స్ తీసిన కాంచన-3తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిక్కీ తంబోలీ. ఆ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన తిప్పరా మీసం అనే సినిమా కూడా చేసింది. ఈ రెండు సినిమాలతో ఓ మోస్తరుగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తన సోషల్ మీడియా పేజీలో మాత్రం సూపర్ హిట్టయింది.

నిక్కీ పెట్టే ఫొటోలకు సోషల్ మీడియాలో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె స్టిల్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తాయి. తాజాగా నిక్కీ పెట్టిన ఓ స్టిల్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. పైన పింక్ కలర్ టాప్ వేసి, కింద జీన్స్ ప్యాంట్ జిప్ ను సగం తీసేసి నిక్కీ దిగిన ఫొటో వైరల్ అవుతోంది.

ఇలా హాట్ హాట్ ఫొటోలు పెట్టడం నిక్కీకి కొత్తకాదు. ఎప్పటికప్పుడు తన గ్లామర్ డోస్ ను పెంచుకుంటూ పోతోంది ఈ చిన్నది. మొన్నటిమొన్న హోలీ రోజు కూడా నిక్కీ పెట్టిన స్టిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. అవింకా మనసుల్లోంచి చెరిగిపోకముందే, ఇప్పుడిలా జిప్ తీస్తూ మరో హాట్ ఫొటో వదిలింది ఈ సెక్సీ బ్యూటీ.