డేట్ విషయంలో నితిన్ జాగ్రత్త పడాలి!

Nithin's Bheeshma hit but struggling to cross $1M mark
Monday, March 9, 2020 - 18:30

నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. కట్ చేస్తే, ఈ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు ఆపసోపాలు పడుతోంది .  అందరూ చెప్పినట్టు సూపర్ హిట్ సినిమానే. కాకపోతే రాంగ్ టైమ్ లో రిలీజైంది. అందుకే పెద్ద బ్లాక్ బస్టర్ కావాల్సిన మూవీ.. సూపర్ హిట్ వద్దే ఆగింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి లాభాలు వచ్చాయి. 

అటు ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి. మొదటి 2 రోజుల వసూళ్లు చూసి ఈ సినిమా మినిమం 1.5 మిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని లెక్క కట్టింది ట్రేడ్. కట్ చేస్తే, ఇప్పుడీ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా చేరలేదు. క్లబ్ కు ఒక్క అడుగు దూరంలో అగిపోయింది. రాబోయే రోజుల్లో ఇది 10 లక్షల డాలర్ల మార్క్ అందుకుంటుందా అనేది కాస్త అనుమానమే. ఇప్పుడు బాగా పుష్ చెయ్యాలి మరి. రికార్డ్ కావాలంటే తప్పదు. 

ఈ సినిమాతో నితిన్ కు ఓ విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది. కంటెంట్ మాత్రమే కాదు, సినిమా రిలీజయ్యే సీజన్ కూడా చాలా ముఖ్యమనే విషయాన్ని నితిన్ తెలుసుకున్నాడు. తన అప్ కమింగ్ మూవీస్ కైనా నితిన్ సరైన డేట్స్ లాక్ చేసుకుంటే బెటర్.