అపుడే నిత్య కౌంట్‌.. హాఫ్‌ సెంచరీ

Nithya Menen announces 50th film
Thursday, September 5, 2019 - 16:30

నిత్య మీనన్‌ ..అద్భుతమైన నటి. నేటి తరం హీరోయిన్లలో కళ్లతోనే వేల భావాలను పలికించే అతికొద్దిమంది హీరోయిన్లలో ఒకరు నిత్య. తన లుక్స్‌తో కాకుండా తన యాక్టింగ్‌తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు సంపాదించగలగింది. విజయ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, బన్ని వంటి పెద్ద హీరోల సరసన కూడా నటించగలిగింది అంటే ఆమె టాలెంట్‌ ఎలాంటిదో చెప్పొచ్చు. అందుకే పదేళ్లల్లోనే 50 సినిమాలు సులువుగా పూర్తి చేసింది.

తాజాగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న 50వ చిత్రం సెట్స్‌పై ఉంది. ఆరాం తిరుకల్పన అనే ఆ మూవీ మొదలైంది. అలా మొదలయింది సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి... నేడు మిషన్‌ మంగళ వరకు అనేక హిట్స్‌లో కనిపించింది నిత్య మీనన్‌. ఐతే ఫిజిక్‌ సరిగా మెయిన్‌టెయిన్‌ చేయలేకపోవడం, అతిగా బరువు పెరగడంతో ఆ మధ్య కెరియర్‌లో ఒడిదొడుకులను చూసింది లేకపోతే...ఆమె కౌంట్‌ ఇప్పటికే 75 దాటేది.