నిత్యకి రాజమౌళి నుంచి పిలుపు నిజమేనా?

Nithya Menon gets call from Rajamouli?
Thursday, April 11, 2019 - 14:00

రాజమౌళి తీస్తున్న "ఆర్‌.ఆర్‌.ఆర్‌" సినిమాలో నిత్య మీనన్ నటించనుందా? సడెన్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రచారం మొదలైంది.  ఆమెకు రాజమౌళి నుంచి పిలుపు వచ్చిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. 

ఈ సినిమాలో యువకుడైన అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్  కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఇంతకుముందు సైన్ చేసిన బ్రిటిష్ భామ ఇటీవలే తప్పుకొంది. ఆమె స్థానంలో మరో ఫారీన్ హీరోయిన్ని ఇంకా తీసుకోలేదు. మరి నిత్య మీనన్ ఏ పాత్ర కోసమో? ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంతో?

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.