సాహో సెట్‌లో కేంద్ర‌మంత్రి

Nitin Gadkari visits Prabhas's Saaho sets
Saturday, April 27, 2019 - 17:30

బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ "సాహో" సెట్ కి వచ్చి అందర్నీ సర్ ప్రైజ్ చేశారు. "సాహో" ప్రస్తుతం ముంబైకి సమీపంలోని కజ్రత్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న గడ్కరీ..... ప్రభాస్ సినిమా షూటింగ్ విషయం తెలుసుకొని సెట్ కి వచ్చారు. "బాహుబలి" సినిమాలతో నార్త్ ఇండియా అంతా పాపులర్ అయ్యాడు . ప్రభాస్. అంతేకాదు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నాయకుడే.

దాదాపు 300 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున రూపొందుతోన్న తెలుగు మూవీ.. "సాహో" సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకొంది. ఐతే పాటల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. దుబాయ్, అబుధాబిలో తీసిన భారీ యాక్షన్ సీన్లు హైలెట్ కానున్నాయి. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తోంది. గడ్కరీ వచ్చినపుడు సెట్లో శ్రద్ధాకపూర్ కూడా ఉంది.

బాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ కీ రోల్లో కనిపిస్తారు ఈ మూవీలో. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ బాహుబలి చిత్రాల కన్నా గ్రాండ్ గా ఉంటుందట.