కేవలం లైఫ్ గురించే!

Nitya Menon during lockdown
Monday, April 27, 2020 - 12:15

నిత్య మీనన్ మరీ ఊసు లేకుండా పోయింది. దానికి రీజన్ ఉంది. ఆమె లాక్డౌన్ పీరియడ్ ని సీరియస్ గా ట్రీట్ చేస్తోంది. మిగతా సెలబ్రెటీల్లా నిత్యా మీనన్ వంటలు, ఫోటోషూట్ పిక్స్ వంటి వాటి జోలికి వెళ్లడం లేదు. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటుంది. "ఇది ఒక గొప్ప అవకాశం. అన్నీ క్లోజ్ చేసి జీవితం గురించి ఆలోచించాల్సిన టైం ఇది. అందుకే సినిమాల్లేవు, మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు," అని చెప్తోంది.

నిత్యా మీనన్ కి అవకాశాలు కూడా తగ్గాయి. ఐతే, వాటి గురించి ఓపిక లేదు ఆమెకి. లైఫ్ గురించే ధ్యాస.

ఇప్పుడు కెరీర్, డబ్బు అంటూ ఎలా ఆలోచిస్తాం? అని ఎదురు ప్రశ్నిస్తోంది. నిత్య మీనన్ ఆలోచనాధోరణి మొదటినుంచి డిఫరెంట్. సినిమాలు ఒప్పుకోవడం నుంచి లైఫ్ ని లీడ్ చేయడం వరకు ఆమె ప్రత్యేకత చాటుకుంటుంది.