24లోకి అడుగుపెట్టిన నివేథా

Nivetha Thomas turns 24
Saturday, November 2, 2019 - 10:15

ఈ రోజు నివేథా థామస్  పుట్టిన రోజు. 24లోకి అడుగు పెట్టింది. చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకొంది ఈ కేరళ కుట్టి. నాని సరసన జెంటిల్ మెన్, నిన్ను కోరి వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన జై లవకుశ, కళ్యాణ్ రామ్ నటించిన '118' లో కూడా తన యాక్టింగ్ టాలెంట్ చూపించింది.

ఈ భామ ఇప్పుడు రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ లో ఆయన కూతురుగా నటిస్తోంది.  గ్లామర్ షోలో అంత దూకుడు లేదు కాబట్టి రావలిసినంతగా అవకాశాలు రావడం లేదు. అయితే ఇంద్రగంటి తీసుతున్న 'వి' సినిమాలో మాత్రం హీరోయిన్ గానే నటిస్తోంది.