ఇది ఎండు చేపల కథ

No Masala in Edu Chepala Katha
Thursday, November 7, 2019 - 20:00

ఈ రోజు ఏడు చేపల కథ సినిమా విడుదల అయింది.  సినిమా విడుదలకి ముందే హీరో  అభిషేక్ రెడ్డి జనాలకి క్లారిటీ ఇచ్చాడు. మసాలా కావాలనుకునే వాళ్లు సినిమాకి రావాలి కథ కోసం మాత్రం రావొద్దు అని చెప్పాడు. హీరో చెప్పాడనే కాదు..... ట్రైలర్లో కూడా మసాలా ఘాటు అదిరిపోయింది. నాటు సరసం తెరపై చూద్దామని హాట్ హాట్ గా కుర్రకారు థియేటర్ల వెంట పరిగెత్తారు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సినిమా కోసం కుర్రాళ్లు ఎగబడ్డారు. ఒక ట్రేడ్ అనలిస్ట్ మాట ప్రకారం... ఒక డిస్ట్రిక్ట్ లో తొలి రోజే 15 లక్షల వసూళ్ళు వచ్చాయట. 

అయితే, థియేటర్ కి వెళ్లిన తర్వాత ఇది హాట్ కాదు చీట్ అని మొత్తుకుంటున్నారు ఆ యంగ్ స్టర్స్. ఒకప్పుటి షకీలా సినిమా రేంజ్ లో కూడా డోస్ లేదంట. ఈ మేకర్స్ చూపించిన "సీనులు " అన్ని ట్రైలర్ కే పరిమితం. వెండితెరపై.... మసాలా దట్టింపు లేని ఎండిపోయిన చేపల కంపు మాత్రమే ఉందట. అందుకే థియేటర్ బయటికి వచ్చి మేకర్స్ ని తిడుతున్నారు. 

ఐతే ... మేకర్స్ ప్లాన్ వర్క్ అవుట్ అయింది. వాళ్ళకి కావలిసింది కలెక్షన్లు, జనం ఫీడ్ బ్యాక్, రివ్యూలు కాదు. వేలం వెర్రితో వచ్చే యంగ్ తరంగ్ లే కావాలి.