రాముల‌మ్మ‌కి పిక్చ‌ర్ అర్థ‌మైందా?

No response for Vijayashanti election campaign
Sunday, December 2, 2018 - 13:45

విజ‌య‌శాంతి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయ‌న‌ర్‌గా ప్ర‌చార రంగంలోకి దిగారు. తెలంగాణ‌లో ఆమె ప్ర‌చారం చేస్తున్నారు కానీ ఆమెకి ప్ర‌చారం ద‌క్క‌డం లేదు. జ‌న‌ర‌ల్‌గా స్టార్ క్యాంపెయ‌న‌ర్ల ప్ర‌చారానికి మీడియా ఎక్కువ క‌వ‌రేజ్ ఇస్తూ ఉంటుంది. కానీ రాముల‌మ్మ ప్ర‌చారానికి మీడియాలో పెద్ద‌గా చోటు ద‌క్క‌డం లేదు. 

ఆమె నిర్వ‌హిస్తున్న స‌భ‌ల‌కి కూడా పెద్ద‌గా స్పంద‌న రావ‌డం లేదు. విజ‌య‌శాంతి చాలా కాలంగా పబ్లిక్ లైఫ్‌కి దూరంగా ఉండ‌డంతో ఆమెకి అంత క్రేజ్ లేదు. ఆమె సినిమాల్లో న‌టించడం మానేసి దాదాపు రెండు ద‌శాబ్దాలు అవుతోంది. పైగా గ‌త నాలుగేళ్ల కాలంలో ఆమె పబ్లిక్‌గా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దాంతో జ‌నంలో ఆమె అంటే వీరాభిమానం లేదు.

ఇటీవ‌ల ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌చారానికి వెళితే..వంద మంది కూడా జ‌నం రాలేద‌ని అలిగి ఆమె స్థానిక కాంగ్రెస్ నేత ఇంట్లోనే కూర్చున్నార‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌పుడు అగ్ర క‌థానాయిక‌గా దేశ‌మంతా పేరొందిన విజ‌య‌శాంతి ఇపుడు ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డం బాధాక‌ర‌మే