ల‌క్ష్మీ మంచుతో అవ‌స‌రాల మూవీ

NRI movie with Avasarala and Lakshmi
Wednesday, February 20, 2019 - 16:00

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా మ‌రో సినిమా మొద‌లైంది. సినిమా పేరు "ఎన్నారై". 'నాయనా రారా ఇంటికి (ఎన్‌.ఆర్‌.ఐ) అనేది ఈ మూవీ ఫుల్ టైటిల్‌. ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.  బాలశేఖరుని దర్శకత్వంలో ప్రదీప్‌ కె.ఆర్‌. నిర్మిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ ఇది.

మ‌హ‌తి అనే తెలుగు అమ్మాయి అవ‌స‌రాల స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమెకిదే తెలుగు చిత్రం. ఇక మంచు ల‌క్ష్మీ ఒక కీల‌క పాత్ర పోషిస్తోంది. బాల‌శేఖ‌రుని కూడా అమెరికాలో ఉండి ఇండియాకి వ‌చ్చారు. ఆయ‌న ఇంత‌కుముందు అన్న‌పూర్ణ స్టూడియోస్ వారి ఫిల్మ్‌స్కూల్‌కి డీన్‌గా చేశారు.

''నాయనా రారా ఇంటికి అనడంలో రకరకాల అర్థాలు వస్తాయి. ఒక్కో రకమైన ఎమోషన్‌తో అంటూ ఉంటే ఒక్కో అర్థం వస్తుంది. అయితే నాయనా రారా ఇంటికి అని ప్రాధేయ పడే సినిమా కాదు. ఇది హైలీ ఎనర్జిటిక్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీ. అలాగే చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫ్యామిలీ మూవీ. అవసరాల శ్రీనివాస్‌గారికి ఒక జిమ్‌ క్యారీగా, చార్లీ చాప్లిన్‌గా, యంగ్‌ రాజేంద్రప్రసాద్‌గా చూద్దామని కోరుకుంటున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చూసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. డైరెక్ట్‌గా నా లైఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నుంచి వస్తున్న సినిమా ఇది. దీన్ని స్ట్రాంగ్‌గా చెప్పొచ్చు. కానీ, ఒక చిలిపి క్యారెక్టర్‌తో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పదలుచుకున్నాను. ఈ కథను శ్రీనివాస్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. హీరోయిన్‌గా రకరకాల భాషల అమ్మాయిల్ని చూశాం. కానీ, తెలుగు మాట్లాడగలిగి ఉండాలి. తెలుగమ్మాయి అయి ఉండాలి. అందుకే భిక్షుగారి అమ్మాయి మహతిని సెలెక్ట్‌ చెయ్యడం జరిగింది. ఈ సినిమాకి పాటలు సీతారామశాస్త్రిగారు రాస్తున్నారు. వాళ్ళబ్బాయి యోగేశ్వరశర్మ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, అని ద‌ర్శ‌కుడు తెలిపారు.