ఎన్టీఆర్ ఆంధ్రావాలానే!

NTR is from Andhra: RGV
Saturday, January 19, 2019 - 15:00

రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" ఇపుడు తెగ ప్ర‌చారం అందుకుంటోంది. మొద‌ట ల‌క్ష్మీపార్వ‌తి లుక్‌ని విడుద‌ల చేశాడు. తాజాగా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేశాడు. ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ జీవితగాథ‌ని "లక్ష్మీస్‌ ఎన్టీఆర్"గా బ‌యోపిక్ తీస్తున్నాడు వ‌ర్మ‌. ఈ  సినిమాలో ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశాడు వ‌ర్మ‌.

అచ్చంగా ఎన్టీఆర్ లేట్ వ‌య‌సులో ఉన్న‌ట్లే ఉన్నాడు ఈ న‌టుడు. ఈ కొత్త న‌టుడు పేరుని వ‌ర్మ వెల్ల‌డించ‌లేదు. దాంతో ఆయ‌న ఒక బెంగాళీ న‌టుడ‌నీ, మ‌రాఠీ న‌టుడంటూ మీడియా స్పెక్యులేట్ చేస్తోంది. ఈ పుకార్ల‌కి, ఊహాగానాల‌కి వ‌ర్మ తెర‌దించాడు. ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న ఆ న‌టుడు ఆంధ్రావాడే అని చెప్పాడు.

పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఆయ‌న ఒక రంగ‌స్థ‌ల న‌టుడ‌ట‌.

"ఆయనకు నేను ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చారు. ఎన్టీఆర్‌లా ప్రసంగించడం, హావభావాలు, వైఖరి తదితర విషయాల్లో నెల‌ల పాటు శిక్షణ ఇచ్చాను," అని వర్మ పేర్కొన్నారు.అయితే ఆ న‌టుడు పేరు ఇప్ప‌టికీ వెల్ల‌డించ‌లేదు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తోంది. ఈ సినిమాని వ‌చ్చే నెలాఖ‌ర్లో విడుద‌ల చేయ‌నున్నాడు వ‌ర్మ‌.