తాత విష‌యంలో ఎన్టీఆర్‌కి ట్రోలింగ్‌

NTR Jr gets trolled
Saturday, January 19, 2019 - 17:00

ఎన్టీఆర్ మరోసారి ట్రోలింగ్ కు గురయ్యాడు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విషయంలో దొరికిపోయాడు తారక్.  నిన్న‌ స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు వర్థంతి.  సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించాడు యంగ్ టైగర్. ఇంతవరకు అంతా బాగానే ఉంది, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

తాతకు నివాళులు అర్పించడానికి టైమ్ ఉంటుంది కానీ తాత జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బయోపిక్ చూడ్డానికి మాత్రం టైమ్ ఉండదా అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై తెగ పోస్టులు పడుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులంతా ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాను మెచ్చుకుంటుంటే.. ఒక్క ట్వీట్ చేయడానికి కూడా టైమ్ లేని తారక్, తాతకు నివాళులు అర్పించాడంటూ బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్ షురూ చేశారు.

ఇదివరకు తారక్ పై చాలా విషయాల్లో ట్రోలింగ్ నడిచింది. కానీ దేనిపై పెద్దగా స్పందించలేదు ఈ హీరో. కానీ ఈ ట్రోలింగ్ ను ఎన్టీఆర్ ను లైట్ తీసుకుంటాడని అనుకోలేం. ఎందుకంటే ఇది తాతకు సంబంధించిన మేటర్. బాబాయ్ బాలయ్య నటించిన బయోపిక్ తో లింక్ ఉన్న వివాదం. కాబట్టి ఏదో ఒక టైమ్ లో ఈ ట్రోలింగ్ పై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.