మొన్న మహేష్.. ఈసారి అఖిల్

NTR Jr to grace Mr Majnu's event
Thursday, January 17, 2019 - 16:00

హీరోలంతా ఇప్పుడు భలేగా కలిసిపోతున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్ కు మరొకరు ప్రత్యేక అతిథులుగా హాజరై అన్యోన్యత చాటుకుంటున్నారు. మొన్నటికిమొన్న "భరత్ అనే నేను" సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్, ఈసారి అఖిల్ తో కలిసి వేదిక పంచుకోబోతున్నాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎల్లుండి (19-శనివారం) "మిస్టర్ మజ్ను" ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మెరవబోతున్నాడు యంగ్ టైగర్.

అఖిల్ సినిమా ఫంక్షన్లకు ఇలా ప్రత్యేక అతిథులు రావడం కొత్తేంకాదు. అఖిల్ సినిమా అంటే నాగార్జున, నాగచైతన్య కచ్చితంగా ఉంటారు. కానీ బయట నుంచి హీరోలు కూడా వస్తుంటాయి." హలో" సినిమా ఈవెంట్ కు రామ్ చరణ్, చిరంజీవి కలిసి వచ్చారు. ఆ టైమ్ లో అత్యుత్సాహంతో, విడుదలకు ముందే "హలో" సినిమా స్టోరీ కూడా కొంచెం చెప్పేశారు చిరంజీవి.

ఇప్పుడు "మిస్టర్ మజ్ను" సినిమాకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ సినిమా నిర్మాత బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ కుమారుడు బాపినీడు ఎన్టీఆర్ జూనియ‌ర్‌కి క్లోజ్ ఫ్రెండ్‌. అందుకే వెంట‌నే త‌న అంగీకారం తెలిపాడు జూనియ‌ర్‌. వరుసగా ఫ్లాపులు రావడంతో మిస్టర్ మజ్ను సినిమాపై బజ్ తగ్గింది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ రావ‌డం సినిమాకు క్రేజ్ తీసుకురానుంది.