కొమరం భీం ట్రీట్ కాదు ట్వీట్ మాత్రమే!

NTR Komaram look didn't come out
Tuesday, October 22, 2019 - 15:00

ఈ రోజు కొమరం భీం జయంతి. కొమరం భీం పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని ఈ రోజు రిలీజ్ చేస్తారని మొన్న తెగ ప్రచారం జరిగింది. కానీ ఆర్.ఆర్.ఆర్.  టీం నుంచి అలాంటి ట్రీట్ ఏమి రాలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ చాలా స్లో గా సాగుతోంది. దాంతో సినిమాని ముందు అనుకున్న డేట్ నాడు రిలీజ్ చేయబోవడం లేదు. జులై 2020 నుంచి మరో ఆర్నెల్లు వాయిదా పడనుంది. అందుకే కొమరం లుక్ రిలీజ్ చెయ్యలేదు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తారు