జూనియర్.. రాజకీయాలకి దూరం

NTR no to politics
Tuesday, March 19, 2019 - 15:30

ఎన్టీఆర్ మామ ..నార్నే శ్రీనివాసరావు తాజాగా వైసీపీలో చేరారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో వెళ్తారేమో అని ప్రచారం జరుగుతోంది. ఐతే ఎన్టీఆర్ మాత్రం.. రాజకీయాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. సినిమాలపైనే ఫోకస్. ఏ పార్టీకి ప్రచారం చేయడట.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్- కల్యాణ్ రామ్‌ల సోదరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచారు. ఐనప్పటికీ, ఎన్టీఆర్ కానీ, కల్యాణ్ రామ్ కానీ ఆమె కోసం ప్రచారం చేయలేదు. తెలుగుదేశం పార్టీకే క్యాంపెయింగ్ చేయని ఎన్టీఆర్ తన మామయ్య కోసం వైకాపాకి ప్రచారం చేస్తాడనుకోవడం భ్రమ.

ఆర్.ఆర్.ఆర్ సినిమాని ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియెన్స్‌గా భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా మేకింగ్ లో పూర్తిగా ఇన్ వాల్వ్ అవుతున్నాడు.