ప్ర‌చారానికి జూనియ‌ర్ రావ‌డం లేదు

NTR to stay away from campaigning
Sunday, December 2, 2018 - 15:45

నంద‌మూరి సుహాసిని కోసం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌చారంలోకి దిగాడు. ఆమెతో పాటు ఇతర తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున మ‌రో రెండు రోజులు ప్ర‌చారం చేయనున్నాడు బాల‌య్య‌. ఐతే, సుహాసిని కోసం క‌ల్యాణ్‌రామ్‌, జూనియ‌ర్‌లో చివ‌రి నిమిషంలో రంగంలోకి దిగుతార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు టాక్ న‌డిచింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఇద్ద‌రూ ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

మ‌రీ ఒత్తిడి చేస్తే క‌ల్యాణ్‌రామ్ ప్ర‌చారం చివ‌రి రోజు అయినా కూక‌ట్‌ప‌ల్లి ఏరియాలో తిరిగే అవ‌కాశం ఉంది కానీ జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా దూరంగానే ఉండాల‌ని ఫిక్స్ అయ్యాడు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌పై ఎలాంటి ఆస‌క్తి లేద‌ని, సినిమాల‌పైనే ఫోక‌స్ అనేది ఎన్టీఆర్ వాద‌న‌. సొంత సిస్ట‌ర్ రంగంలోకి దిగిందనీ, ఇపుడు ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తే ఆ త‌ర్వాత చంద్ర‌బాబునాయుడు త‌మ‌న ఎలా వాడుకుంటాడో ఎన్టీఆర్ గ్ర‌హించాడు. అందుకే ముందు జాగ్ర‌త్త‌గా దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడ‌ట‌.

ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి తీస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. డిసెంబ‌ర్ మొద‌టి వారం అంతా ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా మొద‌టి షెఢ్యూల్ పూర్త‌య్యేనాటికి ఎన్నిక‌లు కూడా ముగుస్తాయి.