జూనియ‌ర్ గాయం చిన్న‌దే

NTR's minor injury
Wednesday, April 24, 2019 - 23:45

జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడ‌నీ, ఆర్‌.ఆర్‌.ఆర్ షూటింగ్ మ‌రింత లేట్ కానుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప‌ది రోజుల క్రితం రామ్‌చ‌ర‌ణ్‌..ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమా కోసం వ్యాయ‌మం చేస్తుండ‌గా గాయ‌ప‌డ్డాడు. మూడు వారాలా పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. దాంతో చ‌ర‌ణ్ అవ‌స‌రం లేని స‌న్నివేశాల‌ను రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇపుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా గాయ‌ప‌డ్డాడ‌ని వార్త‌లు రావ‌డంతో అంద‌రిలో క‌ల‌వ‌రం మొద‌లైంది.

ఐతే జూనియ‌ర్‌కి అయిన గాయం చాలా చిన్న‌ది. షూటింగ్‌లో చేతి ఒరుసుకుపోయింది. దాంతో మూడు రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ వీకెండ్ నుంచి మ‌ళ్లీ షూటింగ్ షురూ చేస్తాడ‌ట‌. ఇలాంటి చిన్న చిన్న గాయాలు హీరోల‌కి కామ‌నే. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఇలాంటివి జ‌రుగుతుంటాయి. 

ఎన్టీఆర్‌కి అయిన గాయం వ‌ల్ల షెడ్యూల్స్ తారుమారు అయ్యే ప‌రిస్థితి ఏమీ లేదు.