జూనియర్ చిన్నోడు వైరల్

NTR's son Bhargav Ram gets appreciation
Tuesday, March 10, 2020 - 16:30

హోలీ సందర్భముగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. అది ఇన్ స్టాంట్ గా వైరల్ అయింది. అందులోనూ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ అందరిని అట్ట్రాక్ట్ చేశాడు. నిండైన బుగ్గలతో, చురుకైన కళ్ళతో ... ఫోటోలో కొట్టొచ్చ్చినట్లు  కనిపించాడు. తండ్రిని మించిన టాలెంట్ ఉన్నట్లుంది అంటూ తారక్ అభిమానులు మురిసిపోయారు. 

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా అదే ట్వీటాడు. "వదిలితే ఇప్పుడు సర్రున దూసుకొచ్చేలా ఉన్నాడు," అని భార్గవ రామ్ గురించి ట్వీట్ చేశాడు. మొత్తమ్మీద, ఈ హోళీ అకేషన్ లో ఎన్టీఆర్ చేసిన విషెస్ హైలైట్ అయ్యాయి. ఈ ఫొటోతో అభిమానులు కొన్నాళ్ళు ఖుషీగా ఉంటారు. 

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ తో బిజిగా ఉన్నాడు.