స‌రిలేరు.. పాత హీరోయిన్ల‌కి రీఎంట్రీ వేదిక‌

Old actresses are making comeback in Sarileru Neekevvaru
Tuesday, July 23, 2019 - 15:15

ఓల్డ్ ఈజ్ గోల్డ్‌. అనిల్ రావిపూడి దీన్ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే ఒక‌ప్ప‌టి టాప్ హీరోయిన్ల‌ని, గ్లామ‌ర్ క్వీన్స్‌ని రీఎంట్రీ చేయిస్తున్నాడు. ఆయ‌న తాజాగా తీస్తున్న మూవీ.. "స‌రిలేరు నీకెవ్వ‌రు". మ‌హేష్‌బాబు హీరో. ఈ సినిమాలో కీల‌కమైన మ‌ద‌ర్ ఇండియా త‌ర‌హా పాత్ర‌లో విజ‌యశాంతిని తీసుకున్నారు. దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఆమె న‌టిస్తున్న మూవీ ఇది. ఆమెకిది రీఎంట్రీ. 

విజ‌య‌శాంతితోనే స‌రిపెట్ట‌లేదు అనిల్‌రావిపూడి. ఒక్క ఛాన్స్ అంటూ ఖ‌డ్గం వంటి సినిమాల్లో అద‌ర‌గొట్టిన సంగీత‌ని కూడా మ‌ళ్లీ న‌టింప‌చేస్తున్నాడు. ఆమెకి కూడా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు ఈ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు. కొంత గ్యాప్ త‌ర్వాత ఆమె న‌టిస్తున్న మూవీ ఇది.

సంగీత ఒక‌పుడు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కి పెట్టింది పేరు. పెళ్లాం ఊరిళితే, విజ‌యేంద్ర‌వ‌ర్మ‌ వంటి సినిమాల్లో న‌టించింది. క్రిష్ అనే త‌మిళ సింగ‌ర్‌ని పెళ్లి చేసుకొని చెన్నైలో స్థిర‌ప‌డింది. న‌ల‌భై ఏళ్ల ఈ సుంద‌రి దాదాపు 10 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత తెలుగులో న‌టిస్తోంది.