సినిమా చూసి ఊరంతా నవ్వుకుంటున్నారు

Oorantha Navvukuntunnaru - review
Saturday, October 5, 2019 - 17:45

ట్రయిలర్ చూస్తే ఓ మంచి ఫీలింగ్ కలిగింది. పల్లెటూరి నేపథ్యం, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, రావురమేష్  క్యారెక్టర్.. ఇలా మంచిమంచి ఎలిమెంట్స్ ట్రయిలర్ లో చూపించారు. దీంతో అంతోఇంతో బజ్ క్రియేట్ అయింది. తీరా థియేటర్లలోకి వెళ్లిన  తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇదంతా ఊరంతా అనుకుంటున్నారు సినిమా గురించి. నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా చూసి ఊరంతా నవ్వుకుంటున్నారు.

అవును.. సినిమా సెకెండాఫ్ మొత్తం చాలా సిల్లీగా తీశారు. ఊరు కట్టుబాట్లు, బంధాలు-అనుబంధాలు, సెట్స్ అన్నీ బాగున్నప్పటికీ.. ఎప్పుడైతే సైకిల్ పందాలు పెట్టారో అప్పుడే సినిమా పోయింది. హీరోయిన్ ను సైకిల్ పై ముందర కూర్చోబెట్టుకొని రేసులో పాల్గొనాలి. ఇది పాత చింతకాయపచ్చడి ఫార్ములా. ఇలా సైకిల్ రేసులు పెట్టకుండా, మరో ముగింపు ఇచ్చినట్టయితే సినిమా అవుట్ పుట్ కాస్త డీసెంట్ గా ఉండేది.

మొత్తమ్మీద ఓ ఫీల్ గుడ్ కథను అతుకుల బొంతగా మార్చేసి చేజేతులా ఫ్లాప్ కొనితెచ్చుకున్నారు. దీనికితోడు రావురమేష్, జయసుధ మినహా మిగతా నటీనటులెవరు పెద్దగా తమ నటనతో ఆకట్టుకోలేకపోవడం సినిమాకు మైనస్ అయింది. చివరికి హీరో కూడా చేతులెత్తేయడంతో.. ఈ సినిమా గురించి ఏ ఊరిలో ఎవ్వరూ ఏమీ అనుకోవడం లేదు.