గీతా, యువి చేతికి 'పలాస 1978'

Palasa 1978 goes to Geetha Arts and UV
Thursday, December 26, 2019 - 17:30

సినిమాలో మేటర్ ఉంది అనుకుంటే చిన్న సినిమాలకి సపోర్ట్ ఇస్తున్నాయి పెద్ద కంపెనీలు. గీతా ఆర్ట్స్, యువి ప్రొడక్షన్స్ సంస్థల దృష్టిలో  పడింది ''పలాస 1978''. పలాసలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన ''పలాస 1978'' చిత్రాన్ని GA2-UV సంస్థ ద్వారా విడుదల చేస్తున్నామని సంస్థ తరపున బన్నీ వాసు తెలిపారు.

అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీ లకు బాగా నచ్చిందట. కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పిస్తున్నారు. రక్షిత్, నక్షత్ర జటగా నటించారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జనవరిలో రిలీజ్  కానుంది.