పందెంకోడి 2.... అపుడే నాలుగు కోట్లు

Pandem Kodi 2 collects Rs 4 Cr
Sunday, October 21, 2018 - 13:30

పందెంకోడి 2 సినిమా తెలుగు రైట్స్‌ని ఆరు కోట్ల రూపాయ‌ల‌కి కొన్నారు. ఈ సినిమా తొలి మూడు రోజుల‌కి నాలుగు కోట్ల‌కి పైగా (4 కోట్ల 22 లక్ష‌ల 33వేల 402 రూపాయ‌లు) షేర్ వ‌చ్చింది. మొద‌టి వారంలోనే పెట్టిన పెట్టుబ‌డి రావ‌డం గ్యారెంటీ. విశాల్ కెరియ‌ర్‌లో తెలుగునాట ఇదే అతిపెద్ద ఓపెనింగ్‌. 

పందెంకోడి సినిమాకిది సీక్వెల్‌, ఆ సినిమా బ్రాండ్‌నేమ్‌, విశాల్ గ‌త సినిమా అభిమ‌న్యుడు హిట్ కావ‌డం, కీర్తి సురేష్ హీరోయిన్ కావ‌డం ఈ సినిమా భారీ ఓపెనింగ్‌కి కార‌ణం. ప‌క్కా మాస్ సినిమా కావ‌డంతో గ్రామీణ ప్రాంతాల్లో సినిమా బాగా ఆడుతోంది. క్రిటిక్స్ పెదవి విరిచినా.. క‌లెక్ష‌న్లు మాత్రం బాగున్నాయి. 

లింగుస్వామి డైర‌క్ట్ చేసిన ఈ మూవీని ఠాగూర్ మ‌ధు తెలుగునాట విడుద‌ల చేశారు.