ట్రాలింగ్‌కి గుర‌వుతున్న జ‌న‌సేనాని

Pawan Kalyan being trolled
Monday, December 17, 2018 - 16:00

సినిమా తార‌లు ఎలా మాట్లాడినా చెల్లుతుంది కానీ రాజ‌కీయ నాయ‌కులు నోరు జారితే ట్రాలింగ్‌కి గుర‌వుతారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప్ర‌స్తుతం అమెరికాలోని డ‌ల్లాస్‌లో ఉన్నారు. అక్క‌డ ఆయ‌న చేసిన ఉప‌న్యాసం ఇపుడు ట్రాలింగ్‌కి గురి అవుతుంది.

భ‌గ‌త్ సింగ్ 23 ఏళ్ల వ‌య‌సులోనే దేశం కోసం త‌న ప్రాణాన్ని త్యాగం చేశాడు, బ్రిటీషు వారికి ఎదురొడ్డి వీర మ‌ర‌ణం పొందాడు అని చెప్పాల్సింది పోయి... భ‌గ‌త్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న‌ట్లుగా నోరు జారాడు జ‌న‌సేన అధ్య‌క్షుడు. ఆయ‌న ఉద్దేశం..వీర త్యాగం కానీ అది పొర‌పాటున ఆత్మ‌హ‌త్య‌గా ప‌లికాల్సి వ‌చ్చింది. ఐతే, నోరు జారిన వెంట‌నే ఆయ‌న త‌న మాట‌ని వెన‌క్కి తీసుకొని స‌వ‌రించుకొని ఉంటే బాగుండేది. అందుకే ఇపుడు నెటిజ‌న్లు పవ‌ర్‌స్టార్‌ని ట్రాల్ చేస్తున్నారు.

ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో మాట్లాడిన‌పుడు ఎంత‌టి వారైనా ఇలాంటి స‌మ‌స్య ఎదుర్కొంటారు. కానీ షాహిద్ భ‌గ‌త్ సింగ్ లాంటి ఫ్రీడం ఫైట‌ర్స్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌పుడు కొంత జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. జ‌న‌సేన అధ్య‌క్షుడు ఇకపై కొంత కేర్ తీసుకుంటే మంచిది.

ఐతే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి చ‌రిత్ర కూడా తెలియ‌దా అంటూ ట్రాల్ చేయ‌డం అన్యాయం.