గులాబీ బాస్‌కి ప‌వ‌ర్‌స్టార్ కంగ్రాట్స్‌

Pawan Kalyan congratulates KCR
Wednesday, December 12, 2018 (All day)

తెలంగాణ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి కొత్త చ‌రిత్ర‌ని సృష్టించింది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. 88 స్థానాల్లో విజ‌యం సాధించింది. గులాబీ బాస్ కేసీఆర్‌కి ప్ర‌ధాని మోదీ స‌హా అగ్ర‌నేత‌లంతా అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హైద‌రాబాద్‌లో లేక‌పోవ‌డంతో ప్ర‌త్యేకంగా ప్రెస్‌నోట్‌తో త‌న అభినంద‌న‌లను అందించారు.

ఈ తీర్పుతో తెలంగాణ ప్ర‌జ‌ల విజ్ఞ‌త మ‌రోసారి రుజువైంది. తెలంగాణ కోసం చేసిన త్యాగాలు, తెలంగాణ‌ని తెచ్చిన తెరాసకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కి ప‌ట్టం క‌ట్టి త‌మ మ‌న‌సులోని మాట‌ని మ‌రోసారి నిరూపించారు. ఇంత‌టి విజ‌యాన్ని సాధించిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌నలు తెలుపుతున్నాను. ఈ ఎన్నిక‌ల‌లో అత్య‌ధిక మెజార్టీతో గెలుపొందిన హ‌రీష్ గారికి నా శుభాకాంక్ష‌లు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కంగ్రాట్స్ తెలిపారు.