అమ‌రావ‌తిలోనూ జ‌న‌సేనానిది అదే వైఖ‌రి

Pawan Kalyan feeding cattle in Amaravathi
Thursday, March 7, 2019 - 23:30

వ్య‌వ‌సాయం అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఎంతో ఇష్టం. అగ్రిక‌ల్చ‌ర్ మ‌న క‌ల్చ‌ర్ అని భావించే వారిలో ఒక‌రు జ‌న‌సేనాని. హైద‌రాబాద్‌లో ఉన్న‌పుడు శంక‌ర్‌ప‌ల్లిలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే ఎక్కువ‌గా గ‌డుపుతుంటారు. మొక్క‌లుకి నీరు పోయ‌డం, ప‌శువుల‌కి గ్రాసం వేయ‌డం ఆయ‌న‌కి సంతృప్తినిచ్చే వ్యాప‌కాలు.

ఇపుడు జ‌న‌సేన అధ్య‌క్షుడు త‌న మ‌కాం విజ‌య‌వాడకి మార్చారు. అమ‌రావ‌తి స‌మీపంలో జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాన్ని స్థాపించారు. ఆ ఆఫీస్‌లోనే కొన్ని ఆవుల‌ను కొని ఉంచారు. వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల అనంత‌రం గురువారం సాయంత్రం కొంత టైమ్ దొర‌క‌డంతో త‌న‌కిష్ట‌మైన ఆవుల‌కి మేత వేస్తూ గ‌డిపారు. అపుడు క్లిక్ మ‌నిపించిన ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 

రాజ‌కీయవేత్త‌గా ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌ట్టికీ ఆయ‌న ఇలా సేద‌దీరుతుంటారు. జంతుప్రేమ‌, ప‌శుపక్ష్యాదుల ప‌ట్ల  ఉండే ఆపేక్ష ఎప్ప‌టికీ పోదు.