ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి మ‌రో ఇల్లు!

Pawan Kalyan gets new address in AP
Saturday, March 30, 2019 - 15:30

ప‌వ‌న్ క‌ల్యాణ్ రీసెంట్‌గానే త‌న అడ్రెస్ మార్చుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగిన జ‌న‌సేన అధినేత ఇటీవ‌లే మంగ‌ళ‌గిరికి త‌న మ‌కాం మార్చారు. ఓటు హ‌క్కుని కూడా మార్చుకున్నారు. హైద‌రాబాద్‌లోని శంక‌ర్‌ప‌ల్లిలోని త‌న ఫామ్ హౌస్ కాకుండా మంగ‌ళ‌గిరిలో కూడా సొంతంగా ఇళ్లు క‌ట్టుకుంటున్నారు. గ‌తేడాది భార్య‌తో క‌లిసి భూమి పూజ చేశారు. అది ఇంకా పూర్తి కాలేదు. కానీ ఆంధ్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఇదే ప‌ర్మినెంట్ రెసిడెన్సీ కానుంది.

ఐతే ప‌వ‌న్ కల్యాణ్ ఇటు గాజువాక నుంచి అటు భీమ‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్నారు. గెలిచిన త‌ర్వాత గాజువాక ఎమ్మెల్యేగానే కొన‌సాగాలి అనే భావ‌న‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నార‌ట‌. అందుకే ఇపుడు అక్క‌డ ఒక చిన్న ఇల్లుని అద్దెకి తీసుకుంటున్నారు.

గాజువాక వై జంక్ష‌న్ సమీపంలోని క‌ర్ల‌వాని పాలెంలో ఆయ‌న కోసం నివాస గృహాన్ని తీసుకొంది ఆయ‌న పార్టీ.