వెన్ను నొప్పి ఉంది కానీ... !

Pawan's backache not cured yet
Friday, October 11, 2019 - 17:30

పవన్ కళ్యాణ్ కొంతకాలంగా తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అందుకే... ఆంధ్రప్రదేశ్ లో తాను అటెండ్ కావలిసిన రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మొన్నటివరకు ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకున్నారు. అయితే సడ్డెన్ గా పవన్ ... హరిద్వార్ వెళ్లడంతో ఆయన వెన్ను నొప్పిపై పుకార్లు లేచాయి. నడుము నొప్పి అనేది ఒక బహనా అని ... కొన్ని కార్యక్రమాలని తప్పించుకునేందుకు ఇలా చెప్పారని కామెంట్స్ వచ్చాయి. ఇది ఊహించే... జనసేన టీం తమ ప్రెస్ నోట్ లో క్లారిటీ ఇచ్చారు. వెన్ను నొప్పి ఉన్న కూడా హరిద్వార్ మీటింగ్ కి వెళ్లాల్సి వచ్చింది అని క్లారిఫికేషన్ ఇచ్చారు. గంగా నది కాలుష్యంపై అలుపెరగని పోరాటం చేసి కన్నుమూసిన జి.డి.అగర్వాల్ స్మృతి సమావేశానికి వస్తానని ఇంతకుముందే మాట ఇచ్చారు కాబట్టి ..జనసేనాని వెళ్ళాక తప్పలేదట. ఆయన వెన్ను నొప్పి మాత్రం ఇంకా అలాగే ఉంది. 

గంగా నది పరిరక్షణకు తనవంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్.

మరోవైపు, పవన్ కళ్యాన్ ... తిరిగి నటించేందుకు రెడీ అవుతున్నారు. కొత్త ఇన్నింగ్స్ లో మొదటి సినిమా తామే నిర్మించాలని  ఏ.ఎం.రత్నం, మైత్రి నవీన్, దిల్ రాజు...ఇలా పలువురు అగ్ర నిర్మాతలు క్యూలో నిల్చున్నారు. దిల్ రాజు.. రామ్ చరణ్ ద్వారా ప్రయత్నిస్తున్నాడు అని సమాచారం. చరణ్, దిల్ రాజు పార్టనర్స్ గా ఒక మూవీ ప్లానింగ్ లో ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఫైనల్ గా ఎవరికీ ఓటేస్తాడో.