పాయ‌ల్ కెరియ‌ర్ ఊపందుకుంటోందా?

Payaal Rajput's career gets turnaround
Monday, February 4, 2019 - 18:45

"ఆర్ ఎక్స్ 100" విడుద‌లై సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌యిన త‌ర్వాత అంత‌టా వినిపించిన మాట ఏంటంటే...ఆ సినిమా హీరోయిన్ వెంట‌ప‌డుతారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు అని. ఎందుకంటే ఆమె బోల్డ్ న‌ట‌నే ఈ సినిమా విజ‌యానికి కార‌ణం. అందం ఎక్స్‌పోజింగ్‌, ముద్దు సీన్లు, చివ‌ర్లో విల‌నీజం.. ఇలా హీరోయిన్‌గా విశ్వ‌రూపం చూపింది ఈ భామ‌.

విచిత్రంగా పాయ‌ల్ రాజ్‌పుత్‌కి అనుకున్న రేంజ్‌లో ఆఫ‌ర్లు రాలేదు. కానీ అందులో న‌టించిన హీరో కార్తీకేయ‌కి మాత్రం మూడు నాలుగు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాయి. ఇపుడు ఈ భామ‌కి లేట్‌గా గుర్తింపు ద‌క్కుతోంద‌ని చెప్పొచ్చు. స‌డెన్‌గా ఆమెకి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో చిన్న పాత్ర చేసింది పాయల్. దీంతో పాటు మరో  సినిమాలో ఐటెంసాంగ్ చేయబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు రవితేజ హీరోగా రాబోతున్న "డిస్కోరాజా" సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఇప్పుడు నాగ్ న‌టించ‌నున్న మ‌న్మ‌థుడు సినిమాలోనూ ఒక హీరోయిన్‌గా ఆమె పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని మీడియా టాక్‌. ఒక‌వేళ ఈ మూవీ ఓకే అయితే పాయల్ కెరీర్ ఊపందుకున్నట్టే.