పాయల్ అరెస్ట్, 24 వరకు జైల్లోనే

Payal Rohatgi denied bail, to be in jail till December 24
Monday, December 16, 2019 - 15:15

బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి బెయిలు ఇచ్చేనందుకు కోర్టు నిరాకరించింది. భారత మాజీ ప్రధాని నెహ్రు కుటుంబంపై, తల్లితండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది పాయల్. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ రోజు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. డిసెంబర్ 24   వరకు జ్యూడిషయల్ కష్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశాలిచ్చింది. 

ఫేస్బుక్ లైవ్ వీడియోల్లో, సోషల్ మీడియాల్లో ఇకపై ప్రధానులు, మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే... సెలెబ్రిటీలైనా అరెస్ట్ చేస్తారు. ఇంతకుముందు చూసి చూడనట్లు వదిలేసేవారు కానీ ఇకపై ఆలా నడవదు. పాయల్ అరెస్ట్ తో ఇతర సెలెబ్రిటీలకు కూడా కనువిప్పు కలిగినట్లే. 

బిగ్ బాస్ షోతో ఈ భామ బాగా పాపులర్. బాలీవుడ్లో పలు సిఎంమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.