దీపిక గ‌ర్భ‌వ‌తా? నిజ‌మేనా!

Photo: Is Deepika Padukone pregnant?
Tuesday, May 7, 2019 - 23:00

బాలీవుడ్ అందాల సుంద‌రి దీపిక ప‌దుకొనే..గ‌తేడాది న‌వంబ‌ర్‌లో బాలీవుడ్ అగ్ర హీరో ర‌ణ‌వీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ల‌యిన అయిదు నెల‌ల త‌ర్వాత ఆమె మ‌ళ్లీ మేక‌ప్ వేసుకొంది. ఐతే ఇపుడు ఆమె త‌ల్లి కాబోతుంద‌న్న గాసిప్‌ గుప్పుమంది. దీపిక ప్రెగ్నెన్సీ బంప్‌తో ద‌ర్శ‌న‌మిస్తోంద‌ని అంటున్నారు.

ఆమె పెగ్నన్సీ గురించి ఊహాగానాల‌కి కూడా కార‌ణ‌ముంది. తాజాగా ఆమె న్యూయార్క్‌లో జ‌రిగిన మెట్‌గాలా అనే ఈవెంట్‌లో పాల్గొంది. ఈ ఫ్యాష‌న్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రాతో పాటు దీపిక కూడా త‌న అందచందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. ఈ షోలో వెరైటీ డ్రెస్సులో ద‌ర్శ‌న‌మివ్వాలి. ప్రియాంక బార్బీ మోడ‌ల్‌గా ద‌ర్శ‌న‌మిచ్చిన దుస్తుల్లో సూప‌ర్‌గా ఉంది. ఆ దుస్తుల్లో ఆమె ఎక్క‌డా ప్రెగ్న‌న్సీ బంప్‌తో క‌నిపించ‌డం లేదు.

ఐతే ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటోలో మాత్రం ఆమె క‌డుపుతో ఉన్న‌ట్లు అనిపిస్తోంది. ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త నిక్‌తో క‌లిసి దీపిక ఒక ఫోటో దిగింది. ఈ ఫోటోని ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీపిక ఈ ఫోటోలో సైడ్ ప్రొఫైల్‌లో ఉంది. ఈ సైడ్ ప్రొఫైల్ నుంచి ఆమె పొట్ట కొద్దిగా ఉబ్బుగా క‌నిపిస్తోంది. దాంతో అంద‌రూ ఈ ఊహాగానాల‌కి వ‌చ్చారు. ఐతే ఆమె పీర్వోలు మాత్రం అదంతా అబ‌ద్ద‌మ‌ని అంటున్నారు.

ఆమె గ‌ర్భ‌వ‌తి ఐతే... సినిమా షూటింగ్‌లు, ఫ్యాష‌న్ షోల‌తో హ‌డావుడి చేస్తుందా అని తిరిగి ప్ర‌శ్న వేస్తున్నారు.