ట్వీట్లలోనూ పోకిరిది రికార్డే!

Pokiri tweets records
Tuesday, April 28, 2020 - 22:45

2006లో విడుదల అయినపుడు "పోకిరి" బాక్సాఫీస్  రికార్డులను బద్దలుకొట్టింది. కొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా బిజినెస్ రేంజ్ ని పెంచింది. 14 ఏళ్ల తర్వాత మరో రికార్డ్ ని సృష్టించింది. ఈ రోజు ట్విట్టర్ లో ఈ సినిమా గురించి 8.5 మిలియన్ ట్వీట్లు వచ్చాయి. గతేడాది మహేష్ బాబు పుట్టినరోజు నాడు  8.4 మిలియన్ ట్వీట్లు వచ్చాయి. ఇప్పుడు 14 ఎళ్ల పోకిరి గురించి ఏకంగా 8.5 మిలియన్ ట్వీట్లు రావడం విశేషం.

అయితే, ఇవన్నీ ఫాల్స్ ట్వీట్లు అని, మానిప్యులేషన్ ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఫాన్స్ తప్ప ఎవరూ జోక్యం చేసుకోలేదనేది వాస్తవం. 14 ఏళ్ల పాత మూవీ గురించి డబ్బులు పెట్టి ట్వీట్లు వేయించుకుంటారా? దాని వల్ల వచ్చే లాభమే ఏంటి అనేది మహేష్ అభిమానుల వాదన. కేవలం మహేష్ బాబుకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్, చరిష్మా వల్లే ఇది సాధ్యమైంది అని అంటున్నారు.

మరోవైపు, మహేష్ బాబు తన కొత్త సినిమాని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 'గీత గోవిందం' దర్శకుడు  పరశురామ్ చెప్పిన కథకి ఇప్పటికే ఒకే చెప్పారు మహేష్.