పోలీసులు అదుపులో హీరో శివాజీ

Police take Shivaji into custody
Wednesday, July 3, 2019 - 10:30

ఎట్ట‌కేల‌కి శివాజీని అదుపులోకి తీసుకున్నారు హైద‌రాబాద్ పోలీసులు. టీవీ9 షేర్ల‌కి సంబంధించిన కేసులో అలంద మీడియా చేసిన ఫిర్యాదు మేర‌కు శివాజీ కోసం చాలా కాలంగా వెతుకుతున్నారు సైబ‌రాబాద్ పోలీసులు. బుధ‌వారం (జులై3) నాడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు. 

పోలీసుల క‌న్ను క‌ప్పిశివాజీ విదేశాల‌కి పారిపోయే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా ప‌ట్టుబ‌డ్డాడు. అయితే ఆయ‌న్ని అరెస్ట్ చేయ‌డం లేదు అని తెలిపారు పోలీసులు.

కోర్ట్ ఆదేశాల ప్ర‌కారం నోటీసులు జారీ చేస్తాం. శివాజీని విచారణకు సహకరించాల్సిందిగా కోరాం. ఆ త‌ర్వాత తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి ఆలోచిస్తామ‌ని పోలీసులు తెలిపారు. టీవీ మాజీ సీఇవో ర‌విప్ర‌కాష్‌... కొన్ని షేర్లు త‌న‌కి అమ్మాడ‌ని శివాజీ కంపెనీ లా కోర్టులో కేసు పెట్ట‌డంతో...అత‌నిది ఫ్రాడ్ అని అలంద మీడియా కేసు పెట్టింది. ఈ కేసులో విచార‌ణ‌కి హాజ‌రు కావాల‌ని సైబ‌రాబాద్ పోలీసులు రెండు నెల‌ల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ శివాజీ అప్ప‌టి నుంచి త‌ప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా అమెరికాకు వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండ‌గా.. శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.  అతడిపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసు జారీ అయి ఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

న‌టుడిగా మిస్స‌మ్మ, ఖుషీ వంటి సంచ‌ల‌న విజ‌యాలున్నాయి శివాజీకి. ఐతే ఇటీవ‌ల రాజ‌కీయాల‌తో ఇన్‌ఫేమ‌స్ అయ్యాడు. గ‌రుడ పురాణంతో మొత్తంగా బ‌ద్నామ్ అయ్యాడు. ఇపుడు ఈ కేసులో అత‌నికి అరెస్ట్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.