కరోనా కోసం బన్నీ పాట

Police use Ramulo Ramula song for corona awareness
Sunday, March 22, 2020 - 16:15

ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మాస్ మీడియాని మించింది లేదు. అందుకే ప్రభుత్వాలు కూడా  సెలబ్రిటీలతో వీడియో మెసేజ్ లు ఇప్పిస్తుంటాయి. అలాగే సినిమా పాటలను వాడుతుంటాయి. ఇప్పుడు మనందరి సమస్య.... కరోనా. ఈ మహమ్మారిని పారద్రోలాలి అంటే .... జనంలో అవగాహన బాగా ఉండాలి. అందుకే స్థానిక అధికారులు, పోలీసులు కొత్త కొత్త పెద్దలు అనుసరిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కొందరు పోలీసులు "రాములో రాములా" సాంగ్ కి డాన్స్ చేశారు. జనం మధ్య ఆలా డాన్స్ చేస్తూ ... కరోనా గురించి అవగాహన కల్పించారు. 

పార్వతీపురంలో జరిగింది ఇది. 

అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠపురంలో" సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఇది.