అవును.. నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను

Pooja Batra gets married again
Monday, July 15, 2019 - 09:30

ఒకప్పుడు కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. హాట్ హాట్ స్టిల్స్ తో నిద్ర లేకుండా చేసింది. తర్వాత తెరమరుగైంది. ఇన్నాళ్లకు మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారింది మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ పూజా బాత్రా. 90ల్లో తన అందచందాలతో కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆమె వయసు 42 సంవత్సరాలు. 

తను మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని పూజా బాత్రా స్వయంగా బయటపెట్టింది. వారం రోజుల కిందట నటుడు నవాబ్ షాను పెళ్లాడినట్టు వెల్లడించింది. ఢిల్లీలో కేవలం కొద్దిమంది బంధుమిత్రుల మధ్య తమ పెళ్లి జరిగినట్టు ప్రకటించింది. ఈరోజు ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయించబోతోంది. 

తమకు పెళ్లయిన విషయాన్ని నవాబ్ షా సోషల్ మీడియాలో ఓ ఫొటో ద్వారా బయటపెట్టాడు. పెళ్లయిన వెంటనే హనీమూన్ కోసం గోవా వెళ్లిన నవాబ్... అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న స్టిల్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం స్టార్ట్ చేశాడు. అలా వీళ్లిద్దరూ ఒక్కటయ్యారనే విషయం లోకానికి తెలిసింది. 

42 ఏళ్ల పూజా బాత్రా గతంలో లాస్ ఎంజెల్స్ కు చెందిన ఓ డాక్టర్ ను పెళ్లాడింది. వీళ్లిద్దరూ దాదాపు 9 ఏళ్లు కలిసి కాపురం చేశారు. తర్వాత అభిప్రాయబేధాలొచ్చి 2011లో విడిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు పూజా బాత్రాకు నవాబ్ షా రూపంలో మరో తోడు దొరికింది. ఇన్నాళ్లూ అమెరికాకు పరిమితమైన పూజా బాత్రా, ఇకపై బాలీవుడ్ పై ఫోకస్ పెడాతనంటోంది.