అర్జున్ సినిమాకి పూజా డేట్స్‌!

Pooja Hegde allots dates Allu Arjun movie
Wednesday, March 13, 2019 (All day)

మ‌హేష్‌బాబు స‌ర‌స‌న "మ‌హ‌ర్షి" సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. కేవ‌లం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాలి పూజా.  అంటే ఏప్రిల్ నుంచి ఆమె డేట్స్ ఇక ఫ్రీ. ఈ సినిమా కాకుండా తెలుగులో ఆమె న‌టిస్తున్న మ‌రో బ‌డా మూవీ.. ప్ర‌భాస్ హీరోగా జిల్ రాధాకృష్ణ తీస్తున్న ల‌వ్‌స్టోరీ. మ‌హేష్‌బాబు సినిమా పూర్తి కావ‌డంతో ఏప్రిల్ నుంచి అల్లు అర్జున్ సినిమాకి డేట్స్ ఇచ్చింది ఈ అందాల భామ‌.

త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న కొత్త మూవీలో ఆమె హీరోయిన్‌. పూజాకి ఇటు బ‌న్నితోనూ, అటు త్రివిక్ర‌మ్‌తోనూ ఇది రిపిటీ కాంబినేష‌న్‌. గతేడాది త్రివిక్ర‌మ్ తీసిన "అర‌వింద స‌మేత‌"లో అర‌విందగా పూజ న‌టించింది. ఇక "దువ్వాడ జ‌గ‌న్నాథం"లో బ‌న్నితో క‌లిసి డ్యూయెట్‌లు పాడింది. 

పూజ హెగ్డే డేట్స్ ఖ‌రారు అయ్యాయి కానీ బ‌న్ని - త్రివిక్ర‌మ్ సినిమా ప్రారంభోత్స‌వానికి ముహూర్త‌మే ఇంకా ఖరారు కాలేదు. అల్లు అర్జున్ ఏడాదిగా ఖాళీగా ఉన్నాడు. మంచి క‌థ కోస‌మే ఇంత‌కాలం వెయిట్ చేస్తున్నాడు.