అఖిల్‌కి పూజ లేదు

Pooja Hegde and Akhil news
Thursday, June 20, 2019 - 16:00

అఖిల్ హీరోగా రూపొందే నాలుగో చిత్రం త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. వ‌చ్చే వారం నుంచి షూటింగ్ షురూ చేయాల‌నేది ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ప్లాన్‌. ఇప్ప‌టికే ఈ సినిమాని లాంఛ‌నంగా లాంచ్ చేశారు. ఐతే...ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ ఫైన‌లైజ్ కాలేదు.

తాజాగా పూజా హెగ్డేని ఫిక్స్ చేశారనే టాక్ మొద‌లైంది. ఐతే యూనిట్ మెంబర్స్ మాత్రం అది నిజం కాదంటోంది. ప్ర‌భాస్‌తో కొత్త సినిమా, బ‌న్నితో బ‌డా మూవీ చేస్తూ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్ప‌టిక‌పుడు అఖిల్‌కి డేట్స్ ఇవ్వ‌గ‌ల‌దా?

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందే ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఎవ‌రూ సెట్ కాలేదు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చాలా క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి ఈ క‌థ‌ని రాసుకున్నాడట‌. అటు భాస్క‌ర్‌కి, ఇటు అఖిల్‌కి...ఇద్ద‌రికీ హిట్ కావాలి.