బాలీవుడ్ లో నో లక్!

Pooja Hegde bad luck in Bollywood
Tuesday, October 29, 2019 - 15:45

పాతకాలం హారర్ సినిమాల్లో ఓ అందమైన ఆడపిల్ల రా..రామ్మని కమ్మగా ఆహ్వానిస్తుంది. కాస్త భయపడుతూనే, టెంప్త్ అవుతూ ఆమె దగ్గరకు వెళ్తాడు హీరో. కట్ చేస్తే అప్పటివరకు అందంగా కనిపించిన అమ్మాయి కాస్తా ఆడదెయ్యంగా మారిపోతుంది. దీన్నే కాస్త మార్చి పూజాహెగ్డేను అన్వయించుకోవచ్చు. పైకి చూడ్డానికి అందంగా కనిపిస్తోందని సినిమాల్లోకి తీసుకుంటే మాత్రం అడుగుపెట్టిన తర్వాత అంతా రివర్స్.  పూజాహెగ్డే బాలీవుడ్ కెరీర్ సంగతి.

మొదటి సినిమాకే హృతిక్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక పిల్ల తారాజువ్వలా దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. ఆమె దూసుకెళ్లలేదు సరికదా, చివరికి హృతిక్ కెరీర్ కు కూడా కామా పెట్టింది పూజా హెగ్డే. వీళ్లిద్దరూ కలిసి చేసిన మొహాంజదారో సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఒక దశలో కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాడు హృతిక్. ఈ దెబ్బతో పూజా అంటనే పారిపోయేవారు బాలీవుడ్ మేకర్స్. 

అలా మూడేళ్ల పాటు బాలీవుడ్ కు దూరమైంది పూజా హెగ్డే. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు పూజా అందాలకు మరో మేకర్ పడ్డాడు. ఏరికోరి మరీ హౌజ్ ఫుల్ 4లోకి ఆమెను తీసుకున్నారు.. ఈసారి కూడా పూజా హెగ్డే డిసప్పాయింట్ చేయలేదు. అందాలు బాగానే ఆరబోసింది. సినిమాకు ప్రస్తుతానికైతే వసూళ్లు వస్తున్నాయి కానీ ఆశించిన స్థాయిలో అవి లేవు. 3 రోజుల్లోనే వంద కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న మూవీ కాస్తా.. 4 రోజులైనా 85 కోట్ల నెట్ దగ్గరే నడుస్తోంది. అటు రివ్యూస్ లో కూడా సినిమాకు నెగెటివ్ మార్కులు పడ్డాయి. చూస్తుంటే.. పూజాకు బాలీవుడ్ అచ్చొచ్చినట్టు లేదు.