అందాల పాల‌పిట్ట‌కి అంతెక్కువా?

Pooja Hegde getting Rs 2 Cr for Valmiki?
Friday, May 3, 2019 - 15:45

అందాల భామ పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్‌, మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌...ఇదీ ఈ అందాల అర‌వింద సినిమాల లైన‌ప్‌. మ‌హేష్‌తో న‌టించిన మ‌హ‌ర్షి ఈ నెల 9న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌, బ‌న్ని సినిమాల సెట్స్‌పై ఉన్నాయి. మ‌రి పెద్ద హీరోల సినిమాలున్న‌పుడు మిడిల్ రేంజ్ హీరో వ‌రుణ్ తేజ స‌ర‌స‌న యాక్ట్ చేయ‌మ‌ని అడిగితే బెట్టు చేయ‌దా?

హీరోయిన్ బెట్టు చేస్తే నిర్మాత ప‌ర్స్‌కి చిల్లు ప‌డుతుంది. అదే జ‌రిగింది.

హ‌రీష్ శంక‌ర్ తీస్తున్న "వాల్మీకీ" సినిమాలో హీరోయిన్ పాత్ర చేయాల్సిందిగా అడిగార‌ట‌. ఆమె పాత్ర పెద్ద‌దేమీ కాదు. 15 రోజుల్లో తీసేస్తార‌ట‌. ఐతే 15 రోజుల‌కి డేట్స్ ఇస్తాను కానీ రేట్ మాత్రం త‌గ్గించ‌నని చెప్పింది ఈ హాట్ భామ‌. 15 రోజుల పాత్ర‌కి అక్ష‌రాలా 2 కోట్ల రూపాయ‌లు అడిగింద‌ట‌.

హ‌రీష్ శంక‌ర్ ఈ భామే కావాల‌ని ఏరి కోరి తీసుకుంటున్నాడు మ‌రి. ఆమె క్రేజ్ సినిమాకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది ఆయ‌న భావ‌న కావొచ్చు. త‌మిళంలో సూప‌ర్‌హిట్ట‌యిన "జిగ‌ర్‌తండా" అనే సినిమాని "వాల్మీకీ" పేరుతో రీమేక్ చేస్తున్నాడు హ‌రీష్ శంక‌ర్‌. ఇది సినిమా ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కిడ్నాప్ డ్రామా. ఒక రౌడీ పాత్ర‌లో వ‌రుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్నాడు. సినిమా హీరోయిన్ పాత్ర‌కి పూజా హెగ్డేని అడిగార‌ట‌. హ‌రీష్ శంక‌ర్ తీసిన "డీజే" వ‌ల్లే పూజాకి క్రేజ్ వ‌చ్చింది. అందుకే హ‌రీష్ అడిగాడ‌ని, చిన్న పాత్ర అయినా సై అంది.

కానీ రేట్ విష‌యంలో నో కాంప్రమైజ్ అంది ఈ పరువాల పాల‌పిట్ట‌.