బీచ్లో బిగ్ బాస్ భామ సరసాలు

Pooja Ramachandran hot show on beach
Friday, March 13, 2020 - 19:00

"స్వామి రారా" అంటూ కవ్వించిన పూజా రామచంద్రన్ గుర్తుందా. ఆ తర్వాత బిగ్ బాస్ షో లో కూడా ఆమె హంగామా చేసింది. హౌజ్ లోనే కసరత్తులు చేస్తూ, మేల్ పార్టిసిపెంట్స్ తో సమానంగా టాస్కుల్లో పాల్గొంటూ బాగా కవ్వించింది, మెప్పించింది. అయితే అవేవీ ఆమె కెరీర్ కు కలిసిరాలేదు. హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఆమధ్య ఓ సినిమాలో అందాలు ఆరబోస్తూ సాంగ్ చేసినా అది కూడా వర్కవుట్ కాలేదు.

దీంతో ఇప్పుడు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఈ భామ. తన ఇనస్టాగ్రామ్ పేజీలో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా బికినీ ఫొటోల్ని పెట్టి హీట్ జనరేట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తన భర్తతో కలిసి మాల్దీవుల్లో బీచ్ వెకేషన్ లో ఉన్న పూజా రామచంద్రన్.. టు-పీస్ బికినీతో హల్ చల్ చేస్తోంది.

ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కనీసం ఈ బికినీ ఫొటోలైనా ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఏమాటకామాట చెప్పుకోవాలి.. బికినీలో పూజా అదిరిపోయింది. ఆమె ఫిట్ నెస్ కేక.