బోనం ఎత్తిన పూనం

Poonam Kaur celebrates Poonam
Monday, July 29, 2019 - 22:30

పూన‌మ్ కౌర్ మొన్న‌టి వ‌ర‌కు ఏపీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంది.అలాగే టీవీ సీరియ‌ల్స్‌, సినిమాల‌తో బిజీగా ఉంది. ఇక ఇపుడు సొంత ప్రాంతం అయిన హైద‌రాబాద్ సిటీకి సంబంధించిన పోస్ట్‌ల‌తో ఇపుడు సోష‌ల్ మీడియాని నింపేస్తోంది. ఆషాడం వ‌చ్చిందంటే అంటే బోనాల పండుగ‌తో హైద‌రాబాద్ శోభిల్లుతుంది. 

బోనాలు చివ‌రి రోజు పూనం తాను కూడా బోనం ఎత్తింది. చార్మినార్ నుంచి బోనాలను తీసుకెళ్లింది. ఆ ఫోటోను షేర్ చేసింది.

"హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌త్యేక‌మైన‌ది. ఇక్క‌డ అన్ని పండుగ‌ల‌ను కులాల‌కి, మ‌తాల‌కి అతీతంగా ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు. పంట‌లు పండాల‌ని, వాన‌లు ప‌డాల‌ని మొక్కుతూ స‌మ‌ర్పించే బోనాల‌ను చార్మినార్ వ‌ద్ద ఉన్న భాగ్య‌ల‌క్ష్మీ టెంపుల్ వ‌ద్ద ఎత్తినందుకు "ఎంతో ఆనందంగా ఉంద‌ని పోస్ట్ చేసింది పూనం.