నేను కోలుకున్నాను: పోసాని

Posani Krishna Murali is recovering well
Sunday, July 14, 2019 - 17:00

కొంత‌కాలం క్రితం పోసాని కృష్ణ‌ముర‌ళి అనారోగ్యానికి పాల‌య్యారు. మ‌రోసారి ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యార‌ని, ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. దాంతో వాటికి ఎండ్‌కార్డ్ వేసేందుకు పోసాని కృష్ణమురళి స్పందించారు.

"అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే. కానీ చికిత్స తీసుకున్నాను. ఇపుడు మొత్తంగా కోలుకున్నాను.  మ‌ళ్లీ ఎలాంటి స‌మ‌స్య లేదు. కాకపోతే.. బాడీ స్ట్ర‌యిన్ కావొద్ద‌నే ఉద్దేశంతో రెస్ట్ తీసుకుంటున్నాను. రెండు వారాల త‌ర్వాత షూటింగ్‌ల‌లో పాల్గొంటాను. అంత‌కుమించి ఎలాంటి స‌మ‌స్య లేదు. పుకార్లు లేపొద్దు ," అని పోసాని మీడియాకి తెలిపారు. 

పోసాని టాలీవుడ్‌లో బిజీ న‌టుడు. ఒక‌పుడు టాప్ రైట‌ర్. కానీ ఇపుడు క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రోజుకు రెండు ల‌క్ష‌ల పారితోషికం డిమాండ్ చేసే యాక్ట‌ర్‌. అంత బిజీ.