ఆ క్రిటిక్‌కి చుక్క‌లు చూపించిన ప్ర‌భాస్ ఫ్యాన్స్‌

Prabhas fans and Bollywood critic
Wednesday, June 19, 2019 - 09:15

బాలీవుడ్‌లో కె.ఆర్‌.కే అనే ఒక ఫిల్మ్ రివ్యూలు చెప్పే (యూట్యూబ్‌లో) అత‌ను ఉన్నాడు. అత‌ను క్రిటిక్ అన‌డం క‌న్నా అటెన్స‌న్ గ్రాబ‌ర్ అన‌డం క‌రెక్ట్‌. టెన్త్ పాస్ ఇంట‌ర్ ఫెయిల్ బాప‌తు. ఫలానా సినిమా ఆడ‌దు...నా ఓపెన్ చాలెంజ్ అంటూ అనేక సినిమాలు గురించి నెగిటివ్ ట్వీట్లు వేసి క‌ల‌కలం రేపాడు. బాహుబ‌లి 2, సుల్తాన్‌...రెండూ అట్ట‌ర్‌ఫ్లాప్ అవుతాయి అన్నాడు. బాహుబ‌లి ఇండియాలోనే 1000 కో్ట్ల రూపాయ‌ల‌పైన క‌లెక్ట్ చేసింది. సుల్తాన్ 300 కోట్ల రూపాయ‌ల‌పైనే వ‌సూళ్లు అందుకొంది. ఇక గ్యారెంటీగా హిట్ అవుతుంద‌ని ఆయ‌న చాలెంజ్ చేసి మ‌రీ చెప్పిన సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా మిగిలిన లిస్ట్ పెద్ద‌దే.

ఇంత దారుణ‌మైన ట్రాక్ రికార్డు ఉన్నా..అత‌న్ని ఎందుకు ప‌ట్టించుకుంటారు. ట్విట్ట‌ర్‌లో 5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇప్ప‌టికే ఇత‌న్ని ట్విట్ట‌ర్ కంపెనీ రెండుసార్లు బ్యాన్ చేసింది. ఇపుడు ఇత‌ను ప్ర‌భాస్ సాహో సినిమాని, మ‌న సందీప్ వంగా డైర‌క్ట్ చేసిన అర్జున్‌రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్‌ని టార్గెట్ చేశాడు. రెండు ఫ్లాప్ అవుతాయ‌ని ప్ర‌తిరోజు ట్వీటుతున్నాడు.

ఐతే ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్రం కే.ఆరె.కేని వ‌ద‌ల‌డం లేదు. బాహుబ‌లి 2 సినిమా విష‌యంలో నీకు ఎలా చూపించామో గుర్తు చేసుకో అంటూ దెప్పి పొడుస్తున్నారు. అంతేకాదు, రాబోయే పెద్ద సినిమాల్లో ఏ మూవీని చూస్తారు అని ప‌లు హిందీ సినిమాల‌తో క‌లిపి సాహోపై పోల్ పెడితే 70 శాతంమంది సాహోకే ఓటేసి అత‌నికి షాక్ ఇచ్చారు. ప్ర‌భాస్ ఫ్యాన్సా మ‌జాకా!