ఆ టైటిల్‌కే ప్ర‌భాస్ ఫిక్స్ అయ్యాడా?

Prabhas fixes Jaanu as the title?
Friday, January 11, 2019 - 23:45

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఒక‌టి "సాహో". మ‌రోటి జిల్ రాధాకృష్ణ‌కుమార్ డైర‌క్ష‌న్‌లో. ఈ రెండో సినిమాకి "అమోర్" అనే టైటిల్ ఫిక్స్ అయిన‌ట్లు ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అయితే అమోర్ అనే ఆ ఫ్రెంచ్ టైటిల్ ఎంత మందికి అర్ధ‌మ‌వుతుంద‌నే సంశ‌యంతో ఇపుడు "జాను" అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారట‌. "జాను" అనే ఈ టైటిల్ క్యాచీగా ఉండ‌డం, రెండ‌క్ష‌రాల టైటిల్ కావ‌డంతో ప్ర‌భాస్ దీనికి ఫిక్స్ అయ్యాడ‌నేది టాక్‌.

ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఒక ల‌వ్‌స్టోరీ. యూరోప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియ‌డ్ ల‌వ్‌స్టోరీ. ఇప్ప‌టికే ఇట‌లీలో కొన్ని కీల‌క స‌న్నివేశాలు తీశారు. కొత్త షెడ్యూల్ త్వ‌ర‌లోనే మొద‌లుకానుంది. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ఇంత‌కుముందు జిల్ అనే సినిమా తీశాడు. ఇపుడు జాను అంటున్నాడు. 

కృష్ణంరాజు ఒక నిర్మాత‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ చూస్తోంది. ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేదిని మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌గా తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.