పూజాతో ప్ర‌భాస్ పూజ!

Prabhas to launch new film on Sep 6th
Wednesday, September 5, 2018 - 18:00

ప్ర‌భాస్ న‌టిస్తున్న "సాహో" షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎపుడు కంప్లీట్ అవుతుంద‌నే విష‌యంలో ప్ర‌భాస్‌కి కూడా క్లారిటీ లేదు. చేసుకుంటూ వెళ్ల‌డ‌మే. క్వాలిటీ విష‌యంలో కాంప్రమైజ్ లేదు. "బాహుబ‌లి" త‌ర్వాతి మూవీ ఇదే కావ‌డంతో గ్రాండ్‌గా ఉండాల‌ని త‌పిస్తున్నాడు ప్ర‌భాస్‌. ఐతే మ‌రోవైపు, ప్ర‌భాస్‌కి ఇత‌ర నిర్మాత‌ల‌తో పాటు ఇంట్లో నుంచి కూడా చాలా ఒత్తిడి ఉంది. మ‌రో సినిమా మొద‌లుపెట్టాల‌నేది ప్రెష‌ర్.

మ‌రో కొత్త సినిమాని గురువారం (సెప్టెంబ‌ర్ 6, 2018న‌) లాంఛ‌నంగా మొద‌లుపెడుతున్నాడు. పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి సినిమా అధికారికంగా మొద‌ల‌యింద‌నిపిస్తారు. ఎందుకంటే ఈ సినిమా ద్వారా వ‌చ్చే లాభాలు అన్నీ త‌న పెద్ద‌నాన్న కృష్ణంరాజుకే వెళ్తాయి. ఆయ‌న కోస‌మే ఈ మూవీ చేస్తున్నాడు ప్ర‌భాస్‌. పెద్ద‌నాన్న కోస‌మే సాహో మొద‌లు కాక‌ముందే ఈ సినిమాకి పూజ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడు ప్ర‌భాస్‌.

అన్న‌ట్లు ఈ సినిమాలో హీరోయిన్ కూడా పూజానే. డీజే, రంగ‌స్థ‌లం (ఐటెంసాంగ్‌), అర‌వింద‌స‌మేత‌,మ‌హ‌ర్షి చిత్రాల త‌ర్వాత పూజా హెగ్డే ఒప్పుకున్న భారీ తెలుగు చిత్ర‌మిదే. మ‌రి ఈ పూజా కార్య‌క్ర‌మానికి పూజాహెగ్డే వ‌స్తుందా అనేది చూడాలి.

ఈ సినిమాని రాధాకృష్ణ డైర‌క్ట్ చేస్తున్నాడు. ఈ డైర‌క్ట‌ర్ ఇంత‌కుముందు గోపిచంద్ హీరోగా జిల్ అనే సినిమాని తీశాడు. యూవీ క్రియేష‌న్స్ నిర్మించ‌నుంది ఈ సినిమాని. ఈ రెండు సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే ప్ర‌భాస్ ఇత‌ర నిర్మాత‌ల‌కి సినిమాలు ఒప్పుకుంటాడు.