ప్ర‌భాస్ మూవీకి ఫ్రెంచ్ టైటిల్! నిజ‌మేనా?

Prabhas new movie to have Amour as its title?
Monday, October 8, 2018 - 14:30

ప్ర‌భాస్ 20వ సినిమా ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా ప్ర‌భాస్‌తో క‌లిసి జోరుగా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా యూరోప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియ‌డ్ ల‌వ్‌స్టోరీ. కొన్నేళ్ల క్రితం జ‌రిగిన క‌థ‌. ఇందులో ప్ర‌భాస్ భ‌విష్య‌త్ చెప్పే వాడిగా క‌నిపిస్తాడ‌ట‌. ఈ ప్రేమ‌క‌థ‌కి ఫ్రెంచ్ టైటిల్‌ని ఫిక్స్ చేశార‌నేది టాక్‌.

సినిమా అంతా యూరోప్ నేప‌థ్యంగా సాగుతుంది కాబ‌ట్టి అదే ప‌ద్ద‌తిలో "అమోర్" (Amour) అనే టైటిల్‌ని పెట్టార‌ని సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్ మొదలైంది. ఐతే టీమ్ మాత్రం అది నిజం కాదంటోంది. తెలుగు సినిమాకి ఫ్రెంచ్ టైటిల్ పెడితే.. సామాన్య జనానికి అర్థ‌మ‌వుతుందా? అంత సాహ‌సం చేస్తారా?

ఏదీ ఏమైనా  ఈ సినిమా అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతోంది. ఈ సినిమాని రాధాకృష్ణ (ఈయ‌న ఇంత‌కుముందు గోపిచంద్ హీరోగా జిల్ అనే సినిమాని తీశాడు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజు సినిమాని నిర్మిస్తున్నారు.